స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు : ఏపీ సీఐడీ ఏడీజీ

Siva Kodati |  
Published : Sep 14, 2023, 03:56 PM IST
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు : ఏపీ సీఐడీ ఏడీజీ

సారాంశం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందన్నారు ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్ .  అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని.. జీవోలో వున్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని ఆయన పేర్కొన్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందన్నారు ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కాంలో మొత్తం 10 కీలకాంశాలు వున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారని సంజయ్ పేర్కొన్నారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన తెలిపారు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారని సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు వున్నాయని ఏపీ సీఐడీ చీఫ్ చెప్పారు. అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని.. జీవోలో వున్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని ఆయన పేర్కొన్నారు. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారైందని సంజయ్ చెప్పారు. 

ఇకపోతే.. నిన్న సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్ తెలిపారు. అంతేకాదు, కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదని వివరించారు. ఈ కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని, ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయని తెలిపారు.

ALso Read: అగ్రిమెంట్‌కు భిన్నంగా జీవో, క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: ఏపీ సీఐడీ ఏడీజీ

అప్పటి ఏపీ ప్రభుత్వం జర్మనీ కంపెనీ సీమెన్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని సంజయ్ తెలిపారు. అగ్రిమెంట్ రూ. 371 కోట్ల ప్రస్తావన మాత్రమే ఉన్నదని వివరించారు. కానీ, జీవో అందుకు విరుద్ధంగా తీసుకువచ్చారని చెప్పారు. జీవో 90 శాతం, 10 శాతం విధానంలో ఫండింగ్ ఉంటుందని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌లో మాత్రం 90 శాతం, 10 శాతం ప్రస్తావనే లేదని వివరించారు. ఈ విషయాన్ని సీమెన్ కంపెనీనే స్వయంగా ధ్రువపరిచిందని తెలిపారు. ఈ జీవో దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నదని ఆరోపించారు. పూర్తి వివరాలు సీమెన్ కంపెనీకి వెల్లడించలేదని అన్నారు.

జీవోల్లో 13 చోట్ల సీఎంగా చంద్రబాబు సంతకం ఉన్నదని సంజయ్ వివరించారు. బడ్జెట్ అప్రూవ్ చేయడానికి కౌన్సిల్ సమావే శానికి కూడా చంద్రబాబు సంతకం ఉన్నదని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తిని నియమిం చారని, ఆయనకు చాలా పదవులు కట్టబెట్టారని వివరించారు. ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu