ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు.. అందుకే చంద్రబాబు మాయ మాటలు: సజ్జల రామకృష్ణా రెడ్డి

By Sumanth KanukulaFirst Published Dec 15, 2022, 4:24 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారని.. ఆయన పార్టీలో ఊపులేక ముందస్తు మాటలు చెబుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. 
 

ఆంద్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారని.. ఆయన పార్టీలో ఊపులేక ముందస్తు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ప్రజలిచ్చిన ఐదేళ్ల గడువు పూర్తయ్యే వరకు తాము అధికారంలో ఉంటామని చెప్పారు. పొత్తులు, ఎత్తులు.. లాంటి చచ్చు ఆలోచనలు తమకు లేవని అన్నారు. టీడీపీ కార్యకర్తల్లో ఉత్సహం కోసమే చంద్రబాబు ఎప్పుడూ మాయ మాటలు చెబుతుంటారని విమర్శించారు. కౌలు రైతుల సంబంధించి మెరుగైన విధానం ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పొచ్చని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు నేపథ్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో కోట్లాది మంది అభిమానులు పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్దిపొందినవారంతా పాల్గొంటారని అన్నారు. గతంలో వైసీపీ శ్రేణులు 38 వేల యూనిట్ల రక్తదానం చేశారని.. ఈసారి వైఎస్సార్‌సీపీ బ్లెడ్ డోనేషన్ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించామని చెప్పారు. అందులో పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉంటుందన్నారు. 

ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఈ నెల 20న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్టుగా తెలిపారు. ఈ నెల 21న పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా చెప్పారు. 

click me!