మరోసారి తెరపైకి గుడివాడ క్యాసినో వ్యవహారం.. సమాచారం ఇవ్వాలని వర్ల రామయ్యను కోరిన ఐటీ అధికారులు..

Published : Dec 15, 2022, 02:43 PM IST
మరోసారి తెరపైకి గుడివాడ క్యాసినో వ్యవహారం.. సమాచారం ఇవ్వాలని వర్ల రామయ్యను కోరిన ఐటీ అధికారులు..

సారాంశం

గుడివాడ క్యాసినో ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు దృష్టిసారించారు. 

గుడివాడ క్యాసినో ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఐటీ అధికారులు దృష్టిసారించారు. క్యాసినో వ్యవహారంలో సమాచారం ఇవ్వాలని టీడీపీ నాయకుడు ఐటీ నోటీసులు ఇచ్చింది. వివరాలు.. ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్‌లో క్యాసినో నిర్వహించారని టీడీపీ సహా, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. 

గుడివాడ క్యాసినో వ్యవహారంలో కొడాలి నాని, వల్లభనేని వంశీల పాత్ర ఉందని ఆరోపించిన టీడీపీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే‌ట్ సహా, పలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఐటీ అధికారులు.. ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని వర్ల రామయ్యకు నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే ఈ నెల 19న వర్ల రామయ్య విజయవాడలో ఐటీ అధికారులను కలవనున్నారు. 

PREV
click me!

Recommended Stories

సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda
JC Prabhakar Reddy Challenges Peddareddy: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ | Asianet Telugu