తమ రాష్ట్రాన్ని గొప్పగా చూపించుకొనే ప్రయత్నంలో పక్క రాష్ట్రంపై ఇతర రాష్ట్రాలపై కామెంట్ చేయడం సరైంది కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అమరావతి: తమ రాష్ట్రాన్ని గొప్పగా చూపించుకొనే ప్రయత్నంలో పక్క రాష్ట్రంపై కామెంట్ చేయడం సరైంది కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.వాళ్ల రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సూచించారు.
ఏపీలో విద్యుత్, మంచీనళ్లు లేవని తెలంగాణ మంత్రి kTR చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం నాడు Sajjala Ramakrishna Reddy కౌంటరిచ్చారు.హైద్రాబాద్ లో YS Rajasekhara Reddy హయంలోనే రింగు రోడ్డు నిర్మాణం జరిగిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.
Corona సమయంలో తమ రాష్ట్రం అద్భుతంగా పనిచేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో చాలా రాష్ట్రాల కంంటే తామే బెటర్ గా ఉన్నామన్నారు.Telangana రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలున్నాయన్నారు.ప్రజలు మెచ్చిన నచ్చిన నాయకుడు జగన్ అని ఆయన చెప్పారు. ప్రజలకు ఏం కావాలో అది ఆచరించి చూపిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ రకమైన పాలన సాగించినందుకే ప్రతి ఎన్నికల్లో కూడా తమను ప్రజలు ఆదరించి గెలిపించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.ఎవరేం మాట్లాడినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసునన్నారు.
ఇదే తరహాలో తమ రాష్ట్రం వైపు నుండి మాట్లాడితే రాజకీయం అవుతుందన్నారు. దీని వల్ల ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా ఆస్తుల విషయం ఇంకా తేలలేదని ఆయన చెప్పారు.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. అయితే ఈ విషయమై Supreme Court లో కేసులు నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాజధాని లేకుండా ఏపీని విభజించారని ఆయన చెప్పారు.Chandrababu ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు. జగన్ నేతృత్వంలో అభివృద్ది సాగుతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తనకు కొందరు చెప్పారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలోని అన్ని నగరాల్లో కెల్లా హైద్రాబాదే అత్యుత్తమ నగరంగా ఆయన పేర్కొన్నారు.ఇవాళ హైద్రాబాద్ లో జరిగిన క్రెడాయి 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ధ్వసంమయ్యాయన్నారు. విద్యత్, , మంచినీళ్లు కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లేసుకొని వెళ్లి రావాలని కేటీఆర్ సూచించారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో మన వాళ్లు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు వస్తాయని కేటీఆర్ ఆరోపించారు.పరిశ్రమలకు ెపారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు.