జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

Published : Oct 20, 2021, 07:58 AM IST
జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

సారాంశం

పట్టాభి మాట్లాడిన బూతులు,  రెచ్చగొట్టిన తీరును ప్రజలందరూ చూశారని అన్నారు.  సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక శాంతియుతంగా నిరసన చేస్తున్న YSR CP శ్రేణులపై tdp కార్యకర్తలు దాడులు చేశారని అన్నారు.

 అమరావతి :  సీఎం జగన్ ను ఏకవచనంతో దూషిస్తూ  టిడిపి నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి sajjala ramakrishna reddy డిమాండ్ చేశారు.  ఈ వ్యాఖ్యలు ప్రజలకు విస్మయం కలిగించాయి అన్నారు.  కొన్ని నెలలుగా 
Pattabhi ఉద్దేశపూర్వకంగానే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని మండిపడ్డారు.

 పట్టాభి మాట్లాడిన బూతులు,  రెచ్చగొట్టిన తీరును ప్రజలందరూ చూశారని అన్నారు.  సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక శాంతియుతంగా నిరసన చేస్తున్న YSR CP శ్రేణులపై tdp కార్యకర్తలు దాడులు చేశారని అన్నారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
టిడిపి బూత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కు వైఎస్ఆర్ సీపీ పిలుపు నిచ్చింది సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఎప్పుడూ హైదరాబాదులో ఉండే Chandrababu, సోమవారం విజయవాడలో అకస్మాత్తుగా ఎందుకు దిగారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం లో ఏమంటారు పెట్టడానికి ఏపీలో అడుగు పెట్టారని ఆయన ప్రశ్నించారు.

రెండున్నరేళ్లుగా, అందులోనూ ఏడాదిన్నర కాలంలో కూడా  చెక్కుచెదరని  నిశ్చయంతో పేదల కోసం  పని చేస్తున్న ప్రభుత్వం మీద,  సీఎం Jagan Mohan Reddyపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాడలేక  చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని బాబు అంటున్నారని... కానీ,  నిజానికి విఫలమయ్యింది చంద్రబాబు,  ఆయన కుమారుడు లోకేష్ అని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజల సంక్షేమం కోసం  ఒక్కటంటే ఒక్క పథకం  ప్రవేశ పెట్టలేకపోయారు  అని విమర్శించారు.  ప్రతి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు అవుతుంది అందుకు చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గుపడాలి అన్నారు. 

కాకరేపుతున్న పట్టాభి కామెంట్స్: టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లే టార్గెట్.. ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల దాడులు

కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి nakka ananda babuకు పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ, తమిళనాడు పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.

సోమవారం మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఆనందబాబు ఇంటికి రావడంపై పట్టాభిపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.

ఆనంద్ బాబుకు నోటీసులివ్వడంలో చూపిన మెరుపువేగం, గంజాయిసాగుని అరికట్టడంలో చూపితే బాగుండేదంటూ పోలీసులపై కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. పైస్థాయి అధికారులు చెప్పారు కదా అని, కిందిస్థాయిలో ఉన్న పోలీసులు శృతిమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారందరూ భవిష్యత్‌లో చట్టపరంగా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని పట్టాభి హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్