Sajjala: సిగ్గుండాలి.. చంద్రబాబు బెయిల్ పై సజ్జల షాకింగ్ కామెంట్స్

By Rajesh KarampooriFirst Published Oct 31, 2023, 4:45 PM IST
Highlights

 Sajjala:ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు విడుదలను సంబరాలు చేసుకోడానికి సిగ్గుండాలని విమర్శించారు. 

Sajjala: ఏపీ స్కిల్ స్కాం కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత 53 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన నేడు విడుదల కానున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబంరాలు మొదలయ్యాయి. తమ అధినేత రాక కోసం కోట్లాది మంది అభిమానులు వేచిచూస్తున్నారు.  ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు విడుదలను సంబరాలు చేసుకోడానికి సిగ్గుండాలని విమర్శించారు. 

తాడేపల్లిలో మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ గ్రౌండ్స్ లో మాత్రమే చంద్రబాబు హైకోర్టు బెయిల్ వచ్చిందనీ, ఆయనకు కంటికి ఆపరేషన్ కోసం బెయిల్ ఇచ్చారని, నాలుగు వారాల్లో మళ్ళీ సరెండర్ కావాలని ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం ఇన్ని రోజులు నానా అడ్డదారులు తొక్కారనీ, చర్మ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిలాగా ప్రచారం చేశారని విమర్శించారు.

హెల్త్ గ్రౌండ్స్ లో వచ్చిన బెయిల్ కు సంబరాలు చేసుకోడానికి సిగ్గు ఉండాలని అన్నారు. నిజం ఎక్కడ గెలిచింది..? వ్యవస్థలను మ్యానేజ్ చేస్తే చంద్రబాబు బయటకు వచ్చారని విమర్శించారు. చంద్రబాబు నిర్దోషి అని రుజువు చేసుకోడానికి సరైన ఆధారాలు లేవనీ, రాజమండ్రి నుండి రోడ్ షో చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 చంద్రబాబు ఓ రోగి.. లైన్ ఈజ్ బ్యాక్ అంటుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. ఆరోగ్యం బాలేకపోతే వైద్యం చేయించుకొని బుద్దిగా జైలుకి రావాలని, చంద్రబాబు జైలులో ఉన్నా .. బయట ఉన్నా ఒక్కటేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చంద్రబాబు బయట ఉంటేనే బెటర్ అని,ఆయనతో పొలిటికల్ ఫైట్ ఉంటుందని అన్నారు.

ఏపీలో టీడీపీ మూత పడిపోతున్న పార్టీ అనీ, చంద్రబాబు బెయిల్ ఇచ్చింది కంటికి ఆపరేషన్ కోసమేననీ, రాజకీయం చేయడానికి కాదని విమర్శించారు.  ఊరేగిస్తాం.. పొలిటికల్ స్పీచ్ లు ఇస్తాం అంటే కుదరదనీ, చంద్రబాబు పై కేసు ఉంది అది గుర్తు ఉంచుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు బయటకి వస్తే తమకు ఎందుకు భయమని ప్రశ్నించారు. 
 

click me!