రాయలసీమ లిఫ్ట్‌ను టీడీపీ అడ్డుకొంటుంది: సజ్జల రామకృష్ణారెడ్డి

By narsimha lodeFirst Published Jul 26, 2021, 4:25 PM IST
Highlights

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టును టీడీపీ అడ్డుకొంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రాయలసీమకు నష్టమని టీడీపీ నేతలను చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

అమరావతి:  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తన వైఖరిని చెప్పాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు టీడీపీ చీఫ్ చంద్రబాబును కోరారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాయలసీమకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని ఆయన టీడీపీని కోరారు.తక్కువ సమయంలోనే ఎక్కువ నీళ్లు తీసుకొచ్చేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చామన్నారు.

also read:ప్రజలు మెచ్చేపాలనకు ఏలూరు కార్పోరేషన్ ఫలితాలే నిదర్శనం: సజ్జల రామకృష్ణారెడ్డి

ఈ ప్రాజెక్టు వల్ల అన్నాయం జరుగుతోందని టీడీపీని చెప్పాలని ఆయన సవాల్ చేశారు. అలానే టీడీపీ ప్రకటిస్తే ప్రజలు ఏం చేస్తారో చూడాలన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకొనే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ అరాచక, మాఫియా పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. గ్రామ సచివాలయాల్లో ఏ ఒక్కరినీ కూడ తొలగించబోమని ఆయన తేల్చి చెప్పారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ విషయమై ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. 
 

click me!