
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు, పారిశ్రామికవేత్త దివాకర్ రెడ్డి మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దివాకర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. అయితే మంగళవారం అతడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.
సజ్జల దివాకర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం విచారకరమంటూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు నాని. దివాకర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఆళ్ల నాని తెలిపారు. సజ్జల కుటుంబ సభ్యులకు, రామకృష్ణ రెడ్డికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆళ్ల నాని.