
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి మాట్లాడిన వైయస్ జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణలంక సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు.