కోవిడ్ వ్యాప్తి.. అసభ్య ప్రవర్తన: మద్యం షాపును తగలబెట్టిన మహిళలు

By Siva KodatiFirst Published Jul 7, 2020, 7:18 PM IST
Highlights

మద్యపాన నిషేధంపై మహిళలు నిరసన చేయడం తరచుగా జరిగేదే. అయితే ప్రకాశం జిల్లాలో మద్యంపై మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో మహిళలు ప్రభుత్వ మద్యం దుకాణంపై దాడి చేశారు

మద్యపాన నిషేధంపై మహిళలు నిరసన చేయడం తరచుగా జరిగేదే. అయితే ప్రకాశం జిల్లాలో మద్యంపై మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో మహిళలు ప్రభుత్వ మద్యం దుకాణంపై దాడి చేశారు.

అనంతరం మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అనంతరం కరోనా కారణంగా పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నామని... దీనికి తోడు మద్యం షాపులు తమ కుటుంబాలను మరింత దిగజారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబంలో మగవారు ఈ షాపుల వద్దే ఉంటున్నారని.. ఇంట్లో ఉన్న నాలుగు పైసలను కూడా మందు కోసం  ఖర్చు చేస్తున్నారని వాపోయారు. మగవాళ్లు సంపాదనంతా మందు కోసం తగలేస్తే ఏం తిని బతకాలని ఈ గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు.

కనీసం కరోనా కనుమరుగయ్యే వరకు మద్యం షాపులు తెరవొద్దని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇతర గ్రామాల నుంచి వస్తున్న వారితో తమ గ్రామంలో కోవిడ్ 19 వ్యాప్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పక్క గ్రామాల నుంచి వచ్చిన మందుబాబులు.. మద్యంను కొనుక్కున్న తర్వాత అక్కడే తాగుతున్నారని.. అంతేకాకుండా తమ గ్రామంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు. 

click me!