మత్తులో ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వరుణ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్

By Nagaraju penumalaFirst Published May 16, 2019, 10:06 AM IST
Highlights

చెన్నై కోల్ కతా జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆర్టీఏ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సును రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్ పై అనుమానం వచ్చిన రవాణా శాఖ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీఏ, పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లను అరెస్ట్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి విజయవాడలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

అనుమానం వస్తే  డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురు ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు అడ్డంగా దొరికిపోయారు. అయినప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లలో ఎలాంటి మార్పు కనబడటం లేదు. మద్యం తాగి డ్రైవ్ చేస్తూ మరోసారి పట్టుబడ్డారు ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్. 

చెన్నై కోల్ కతా జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఆర్టీఏ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సును రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్ పై అనుమానం వచ్చిన రవాణా శాఖ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. 

మద్యం తాగినట్లు తేలడంతో బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. 

తమ ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో డ్రైవర్ పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. డ్రైవర్ పై కేసు నమోదు చెయ్యడంతో వేరొక డ్రైవర్ తో బస్సును పంపించి వేశారు ఆర్టీఏ అధికారులు.  

click me!