
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ యం. సీతారామమూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సీతారామ మూర్తిని ఏపీ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఈ నెల 21న ప్రభుత్వం జీవో నెం. 32 జారీ చేసింది.
ఈ మేరకు జస్టిస్ సీతారామమూర్తి హైదరాబాదులో రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్ పర్శన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘం జుడీషియల్ సభ్యునిగా విశ్రాంత జిల్లా సెషన్స్ జడ్జి దండే సుబ్రహ్మణ్యం కూడా బుధవారం హైదరాబాదులో బాధ్యతలు స్వీకరించారు.
అలాగే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యునిగా (మెంబర్ నాన్ జుడీషియల్) జి. శ్రీనివాసరావు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు