ఏపీలో కరోనా: ఒక్క రోజులో విశాఖలో వేయికి పైగా కేసులు, గుంటూరులో 15 మంది మృతి

By telugu teamFirst Published Jul 22, 2020, 5:42 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో విశాఖపట్నం జిల్లాలో వేయికి పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 15 మంది మరణించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది.. కోవిడ్ -19కు ఏ మాత్రం కళ్లెం పడడం లేదు. గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా వైరస్ తో 15 మది మరణించారు. విశాఖపట్నం జిల్లాలో ఒక్క రోజులో  వేయికి పైగా కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో విశాఖపట్నం జిల్లాలో 1049 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో ఏపీలో 6045 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 325, చిత్తూరు జిల్లాలో 345, తూర్పు గోదావరి జిల్లాలో 891,  గుంటూరు జిల్లాలో 842,  కడప జిల్లాలో 229, కృష్ణా జిల్లాలో 151, కర్నూలు జిల్లాలో 678, నెల్లూరు జిల్లాలో 327 కేసులు నమోదయ్యాయి.

కాగా, గత 24 గంటల్లో కొత్తగా ప్రకాశం జిల్లాలో 177, శ్రీకాకుళం జిల్లాలో 252, విజయనగరం జిల్లాలో 107, పశ్చిమ గోదావరి జిల్లాలో 672 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరు 64713 కరోనా వైరస్ కేసులు రికార్డయ్యాయి.

ఏపీలో తాజాగా గత 24 గంటల్లో 65 మంది కరోనా వైరస్ తో మరణించారు. కృష్ణా జిల్లాలో పది మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, విజయనగరం జిల్లాలో నలుగురు మరణించారు. ప్రకాశం, శ్రీకాకళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరేసి చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు కోవిడ్ -19 వల్ల 823 మంది మరణించారు.  

ఏపీలో ఇప్పటి వరకు జిల్లాలవారీగా నమోదైన కేసులు, సంభవించిన మరణాలు

అనంతపురం 6266, మరణాలు 80
చిత్తూరు 5668, మరణాలు 64
తూర్పు గోదావరి 8647, మరణాలు 82
గుంటూరు 6913, మరణాలు 78
కడప 3349, మరణాలు 28
కృష్ణా 4252, మరణాలు 118
కర్నూలు 7797, మరణాలు 135
నెల్లూరు 3010, మరణాలు 22
ప్రకాశం 2433, మరణాలు 42
శ్రీకాకుళం 3215, మరణాలు 39
విశాఖపట్నం 3479, మరణాలు 54
విజయనగరం 1803, మరణాలు 23
పశ్చిమ గోదావరి 4986, మరణాలు 58

 

: 22/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను
*29,390 మంది డిశ్చార్జ్ కాగా
*823 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605 pic.twitter.com/ZAIJedU2ZY

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!