కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య !

Published : Apr 22, 2021, 10:13 AM IST
కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య !

సారాంశం

విశాఖ జిల్లా, కంచరపాలెంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శత్రువులు చంపేసి శవాన్ని గుడి దగ్గర పడేసి వెళ్లడంతో స్థానికంగా కలకలం రేగింది.

విశాఖ జిల్లా, కంచరపాలెంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శత్రువులు చంపేసి శవాన్ని గుడి దగ్గర పడేసి వెళ్లడంతో స్థానికంగా కలకలం రేగింది.

విశాఖ కొబ్బరితోట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్( 45) అనే వ్యక్తి  కంచరపాలెం పైడిమాంబ గుడి దగ్గర మృతిచెందాడు. అయితే మృతిచెందడానికి కారణాలుగా ఎవరో  గుర్తుతెలియని వ్యక్తి తలపై  కొట్టడంతో చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

శ్రీనివాస్ కు గతంలో కూడా రెండవ పట్టణ భద్రత పోలీస్ స్టేషన్లో కూడా రౌడీషీట్ ఉందని, పలు దొంగతనాలకు చేస్తూ స్క్రాప్ వ్యాపారం  చేస్తూ  జీవనం సాగిస్తుండేవాడు అని  పోలీసులు అంటున్నారు. 

ఈ హత్య సుమారుగా  గురువారం వేకువజామున జరిగి ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సిఐ కృష్ణారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు  తరలించి కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?