సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద కానిస్టేబుల్ మృతి

Published : Apr 22, 2021, 08:12 AM IST
సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద కానిస్టేబుల్ మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ మరణించాడు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించి క్రమంలో మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు.

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఇడుపులపాయలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద విధులు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ ప్రభాకర్ మరణించాడు, గుండెపోటుతో అతను మృతి చెందాడు. 

11వ బెటాలియన్ కు చెందిన ప్రభాకర్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు వచ్చింది. దాంతో అతన్ని ఆస్పత్రికి తరలించడానికి సహచర ఉద్యోగులు ప్రయత్నించారు. 

ఆస్పత్రికి తీసుకుని వెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే ప్రభాకర్ మరణించాడు. ఈ సంఘటనతో అతని కుటుంబంలో విషాదవాతావరణం చోటు చేసుకుంది.

ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని యలమంచింలి కొత్తపాలెం సమీపంలో ఓ కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu