సహజీవం చేస్తున్న యువతితో రౌడీషీటర్ గొడవ.. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య..

Published : Jun 02, 2022, 10:35 AM IST
సహజీవం చేస్తున్న యువతితో రౌడీషీటర్ గొడవ.. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య..

సారాంశం

విజయవాడలో ఓ రౌడీషీటర్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ యువతితో సహజీవనం చేస్తూ.. మద్యం కోసం వచ్చిన గొడవతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడ : వాంబే కాలనీలో నివాసం ఉంటున్న రౌడీ షీటర్ ఓయా బాను శంకర్ అలియాస్ టోనీ (25)మంగళారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాంబే కాలనీ హెచ్‌ బ్లాక్‌లో అద్దెకు ఉంటున్న శంకర్  టాటూలు వేస్తుంటాడు. మూడు నెలల నుంచి అనూష అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో అనూష అతనిపై అలిగి ఇంటి బయటికి వచ్చి పడుకుంది. దీంతో శంకర్ తలుపులు మూసుకుని చున్నీతో ఫ్యాన్ రాడ్ కు ఉరి వేసుకున్నాడు.

అర్థరాత్రి తర్వాత అనూష మూసి ఉన్న తలుపులు తీసే ప్రయత్నం చేయగా.. రాకపోవడంతో ఆమె మృతిని తమ్ముడు రామకృష్ణకు సమాచారం అందజేసింది. అతను వచ్చి కిటికీలోనుంచి చూడగా  శంకర్ ఉరి వేసుకున్నట్లు గమనించి.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళాడు. అన్నను కిందికి దించి, ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందాడు. మృతుని తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, మంగళవారం టోనీ అత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో యువ ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాష్ స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న ఆకాష్ కు కొందరితో గొడవ జరిగింది. అక్కడున్న వారు వీరిని సముదాయించడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. అంత్యక్రియలు ముగియగానే ఆకాష్ తన గదికి వచ్చాడు. కానీ అంత్యక్రియల్లో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న దుండగులు ఆకాశ్ ఉంటున్న అపార్ట్ మెంట్ కు వచ్చారు, 

ఈ సమయంలో ఒంటరిగా ఉన్న అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు దీంతో ఆకాశ్ రక్తపుమడుగులో కుప్పకూలిన తర్వాత దుండగులు పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న అతడిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతని శరీరంపై 16 కత్తిపోట్లు అయ్యాయి. దీంతో ఆకాశ్ మృతి చెందాడు, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం