ఆరేళ్ల కిందట దోపిడి చేసిన ఇంటిపై మళ్లీ... ఈసారి దొరికింది తక్కువే

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 2:20 PM IST
Highlights

ఒకసారి దోపిడి చేసిన ఇంటిపై మరోసారి దొంగలు అటాక్ చేయరు.. కానీ ఒంగోలులో మాత్రం రెండోసారి దొంగతనానికి వచ్చారు దొంగలు. ఒంగోలులోని కబాడీపాలెనికి చెందిన జేఎల్ గాంధీ కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు

ఒకసారి దోపిడి చేసిన ఇంటిపై మరోసారి దొంగలు అటాక్ చేయరు.. కానీ ఒంగోలులో మాత్రం రెండోసారి దొంగతనానికి వచ్చారు దొంగలు. ఒంగోలులోని కబాడీపాలెనికి చెందిన జేఎల్ గాంధీ కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి అతను బెంగళూరు వెళ్లాడు.

అయితే ఎప్పటి నుంచో కన్నేసిన దొంగలు.. శనివారం రాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 30 సవర్ల బంగారం, రూ.1.20 వేల నగదును దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం గాంధీ సమీప బంధువు ఒకరు ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉండటం.. బీరువా తలుపులు పెకిలించి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిని పరిశీలించి... ఘటనాస్థలంలోని వేలిముద్రల ఆధారంగా ఆధారాలను సేకరించారు.. ఇంటికి ఎదురుగా ఉన్న చర్చి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించారు.  దీని ప్రకారం..  ఇంటి ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేసిన తలుపు తాళాన్ని అత్యంత చాకచక్యంగా పగులగొట్టి దొంగ లోపలికి చొరబడ్డాడు.

చుట్టుపక్కల వారికి ఏమాత్రం వినిపించకుండా... అత్యంత జాగ్రత్తగా తలుపును పగులగొట్టాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి రెండు బీరువాలను రాడ్‌తో పెకలించాడు.. అయితే ఒక బీరువా తాళం చెవి కనిపించడంతో దానిని తెరిచి అందులోని సామానును చిందర వందర చేయకుండా చోరీకి పాల్పడ్డాడు. 30 సవర్ల బంగారం, లక్షా 20 వేల నగదును దోచుకున్నాడు.

అయితే అదే బీరువాలో దాచిన మరో రూ.70 వేల వరకు భద్రంగా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు 2012లో ఇదే ఇంటిపై దొంగలు చోరికి పాల్పడి 70 సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు... అప్పట్లో గుంటూరు జిల్లాకు చెందిన గజదొంగ రాయపాటి వెంకన్న ఈ దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే నాటి దొంగతనం తాలుకూ సొత్తు నేటికి రికవరీ కాలేదు. 

click me!