పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

By narsimha lodeFirst Published Oct 15, 2018, 1:13 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్రిడ్జిపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ‌ కవాతుకు  పోలీసులు అనుమతిని నిరాకరించారు.  ధవళేశ్వరం బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని  పోలీసులు చెబుతున్నారు


రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్రిడ్జిపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ‌ కవాతుకు  పోలీసులు అనుమతిని నిరాకరించారు.  ధవళేశ్వరం బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని  పోలీసులు చెబుతున్నారు.  ఈ కారణంగానే   తాము అనుమతిని నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు ఇప్పటికే  తెలిపినట్టు  పోలీసు ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు.


జనసేన‌ కవాతు, బహిరంగ సభకు  పోలీసులు అనుమతి నిరాకరించారు.  ధవళేశ్వరం బ్రిడ్జి  మీదుగా మోరంపూడి వరకు కవాతు  సాగనుంది.  అయితే బ్రిడ్జి బలహీనంగా ఉందని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి బలహీనంగా ఉన్నందున కవాతుకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

అయితే ఈ విషయమై నిర్వాహకులకు పోలీసులు  సమాచారాన్ని ఇచ్చారు. బ్రిడ్జిపై పదివేల కంటే ఎక్కువ మంది వెళ్తే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని  పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు  బ్రిడ్జి పిట్టగోడలు కూడ బలహీనంగా ఉన్నాయని  కూడ  పోలీసులు చెబుతున్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  జనసేన కవాతుకు  అనుమతిని నిరాకరించినట్టు  పోలీసులు ప్రకటించారు.ఈ మేరకు  జనసేన నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌కు నోటీసులను అందించినట్టు    రాజమండ్రి ఎఎస్పీ లతా మాధురి చెప్పారు.

మరో వైపు కవాతు తర్వాత ఆర్థర్ కాటన్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించాలని జనసేన ప్లాన్ చేసింది. అయితే  ఈ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే  కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే సభను మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించినట్టు సమాచారం.

ఈ కవాతు, సభలను దృష్టిలో ఉంచుకొని  తాము భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కవాతుకు, సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.  అయితే తమ ఆదేశాలను పాటించకపోతే  ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తామని ఏఎస్పీ లతా మాధురి చెప్పారు.
 

సంబంధిత వార్తలు

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్
 

click me!