
ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ గరుఢ బస్సు బోల్తా పడింది. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు. 10మందికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. విజయవాడనుంచి హైదరాబాద్ వెల్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.