అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన కారు. దీంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మహిళతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.