గొల్లపూడిలో ఉద్రిక్తత...విజయవాడ కమీషనరేట్ పరిధిలో ఆంక్షలు

By Arun Kumar PFirst Published Jan 20, 2021, 10:19 AM IST
Highlights

గొల్ల‌పూడిలో ఏర్ప‌డిన పరిస్థితుల దృష్ట్యా స‌భ‌లు, స‌మావేశాలు, ఊరేగింపులు, ధ‌ర్నాలు నిర‌స‌న దీక్ష‌లకు అనుమ‌తి లేదన్నారు సిపి బత్తిన శ్రీనివాసులు.

విజయవాడ: మంగళవారం మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సిపి బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.

గొల్ల‌పూడిలో ఏర్ప‌డిన పరిస్థితుల దృష్ట్యా స‌భ‌లు, స‌మావేశాలు, ఊరేగింపులు, ధ‌ర్నాలు నిర‌స‌న దీక్ష‌లకు అనుమ‌తి లేదన్నారు. ఒకవేళ స‌భ‌లు, స‌మావేశాలు, ఊరేగింపులు, ధ‌ర్నాలు నిర‌స‌న దీక్ష‌లు చేసే వారు త‌ప్ప‌నిస‌రిగా పోలీసుల అనుమ‌తి తీసుకోవాలన్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ ,కోవిడ్‌-19 వ్యాప్తి దృష్య్టా సెక్ష‌న్‌-144 సి.ఆర్‌.పి.సి, సెక్ష‌న్‌-30 పోలీస్ యాక్ట్ అమ‌లులో ఉన్నాయన్నారు. ఐదుగురు లేదా అంత‌కంటే ఎక్కువ మంది బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో గుమిగూడ‌రాదని...నిబంధనలు ఉల్లంగిస్తే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకొంటామని సిపి హెచ్చరించారు.

ఇక పౌర సరఫరాల శాఖ నూతన వాహనముల ప్రారంభోత్సవం సందర్భముగా రేపు(గురువారం) విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు వుంటాయని పోలీసులు తెలిపారు. 21న ఉదయం 10.25 గంటలకు పౌర సరఫరాల శాఖ నూతన వాహనముల ప్రారంభోత్సవం బెంజి సర్కిల్ వద్ద జరిగనుందని... ఈ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్న నేపథ్యంలో బెంజ్ సర్కిల్ మీదుగా ప్రయాణించే వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు. అన్ని భారీ వాహనాలు ,లారీలు 21  ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్ళించనున్నట్లు తెలిపారు.  

20వ తేదీ రాత్రి 9 గంటల నుండి 21  మధ్యాహ్నం 12 గంటల వరకు యం.జి. రోడ్ వాహనాలు అనుమతించబడవన్నారు. చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం ,ఇబ్రహీంపట్నం వైపుకు వెళ్ళు భారీ వాహనాలు ఒంగోలు - త్రోవగుంట- బాపట్ల - అవనిగడ్డ - చల్లపల్లి- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలని... ఏలూరు వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు లారీలు, భారీవాహనాలు హనుమాన్ జంక్షన్  నుండి నూజివీడు మీదుగా వెళ్లాలని సూచించారు.
 

click me!