ఆ ఇద్దరికి తప్ప మిగిలిన మాజీ ఎమ్మెల్యేల గన్ మెన్ల తొలగింపు: జగన్ సర్కార్ పై టీడీపీ ఫైర్

By Nagaraju penumalaFirst Published Jun 15, 2019, 3:38 PM IST
Highlights

మిగిలిన మాజీ ఎమ్మెల్యేల గన్ మెన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆఖరికి మాజీఎంపీ రాయపాటి సాంబశివరావుకు సైతం ఉన్న గన్ మెన్లను తొలగించింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు సైతం ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలందరికీ గన్ మెన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ లకు మాత్రమే వన్ ప్లస్ వన్ గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది. 

మిగిలిన మాజీ ఎమ్మెల్యేల గన్ మెన్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆఖరికి మాజీఎంపీ రాయపాటి సాంబశివరావుకు సైతం ఉన్న గన్ మెన్లను తొలగించింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు సైతం ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. 

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల గన్ మెన్లను రద్దు చేయడంపై టీడీపీ రాద్దాంతం చేస్తోంది. టీడీపీ నేతల భద్రతపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గన్‌మెన్లను తొలగించిందని టీడీపీ ఆరోపిస్తోంది. 

click me!