ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన తనయుడు అనంత్ అంబానీ భేటీ అయ్యారు.
అమరావతి: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కు విచ్చేసిన అంబానీకి జగన్ పుష్ఫగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.
అనంతరం సీఎం జగన్ తో ముఖేశ్, అనంత్ లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపడుతున్న పలు ప్రాజెక్టుల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మరో ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీ కూడా పాల్గొన్నారు.
read more చంద్రబాబును అడ్డుకోవాలని కాదు అడ్డు తొలగించుకోవాలని... విశాఖలో కుట్ర...: సబ్బం హరి
ఏపీలో ఇప్పటికే రిలయన్స్ సంస్థ పలు కార్యాకలాపాలు నిర్వహిస్తుండగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపైనే ముఖ్యమంత్రి జగన్ తో చర్చించేందుకే స్వయంగా ముఖేష్ అంబానీయే సమావేశమయ్యారు.