అరబిందో పరిశ్రమలో పేలిన రియాక్టర్: ఇద్దరి దుర్మరణం

Siva Kodati |  
Published : Aug 11, 2019, 11:24 AM IST
అరబిందో పరిశ్రమలో పేలిన రియాక్టర్: ఇద్దరి దుర్మరణం

సారాంశం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలోని అరబిందో ఫార్మాలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలవ్వగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ రాహుల్, బాయిలర్ ఆపరేటర్ రాజారావు వున్నారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలోని అరబిందో ఫార్మాలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలవ్వగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

మృతిచెందిన వారిలో షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ రాహుల్, బాయిలర్ ఆపరేటర్ రాజారావు వున్నారు. సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నేతలు ఫ్యాక్టరీ వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే వారిని లోపలికి అనుమతించలేదు.

గేట్లకు తాళాలు వేసిన యాజమాన్యం ఎవరిని లోపలికి రావడానికి అనుమతించడం లేదు. దీంతో కార్మిక నేతలు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?