రాయపాటికి మరో చిక్కు, సిబిఐ కేసు: ఆగస్టు 18న ట్రాన్స్ టాయ్ ఆస్తుల వేలం

By telugu teamFirst Published Jul 25, 2020, 5:18 PM IST
Highlights

టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుకు మరో చిక్కు వచ్చి పడింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ టాయ్ అస్తుల వేలానికి సెంట్రల్ బ్యాంక్ సిద్ధపడింది. వచ్చే నెల 18వ తేదీన వేలం జరగనుంది.

హైదరాబాద్:  మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత రాయపాటి సాంబశివ రావు మరో చిక్కులో పడ్డారు. ఆయనపై సీబిఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంక్ రాయపాటికి చెందిన ట్రాన్స్ టాయ్ ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేయనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. బిడ్లు దాఖలు చేయడానికి ఆగస్టు 14ను చివరి తేదీగా నిర్ణయించింది.

సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి రాయపాటి సాంబశివరావు, శ్రీధర్ లతో మరో ఐదుగురు హామీదారులుగా ఉన్నారు. ట్రాన్స్ టాయ్ 2017 జనవరి 9వ తేదీ నాటికి సెంట్రల్ బ్యాంకుకు 452.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

ఇదిలావుంటే, వివిధ బ్యాంకుల నుంచి 3,694 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంపై రాయపాటి మీద సిబిఐ కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకు నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.300 కోట్లు రుణం తీసుకున్న కేసు కూడా ఉంది. 

రాయపాటి సాంబశివ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి గతంలో లోకసభకు ఎన్నికయ్యారు. ఆయన తొలుత కాంగ్రెసులో ఉండేవారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 

click me!