రాయచోటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 19, 2024, 05:07 PM ISTUpdated : Mar 20, 2024, 04:42 PM IST
రాయచోటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

రాయచోటిలో గడికోట, రెడ్డప్ప కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు . 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,50,628 మంది. వీరిలో పురుషులు 1,24,087 మంది.. మహిళలు 1,26,515 మంది. ముస్లింలు, శెట్టి బలిజ, రెడ్డి సామాజిక వర్గం రాయచోటిలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తనకు కంచుకోటలా మారిన రాయచోటిని ఎట్టిపరిస్ధితుల్లోనూ వదులుకోకూడదని జగన్ భావిస్తున్నారు. ముస్లిం, రెడ్డి, దళిత ఓటర్ల మద్ధతు పుష్కళంగా వుండటం శ్రీకాంత్ రెడ్డికి కలిసివచ్చే అంశం. ఈసారి పవన్ కళ్యాణ్‌తో పొత్తు కారణంగా బలమైన బలిజ సామాజికవర్గం మద్ధతు లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో నిలిచారు.   

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం పేరు చెప్పగానే కరువు రక్కసి కళ్లెదుట కనిపిస్తుంది. ఉపాధి లేక ఈ ప్రాంతవాసులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. సాగు, తాగునీటి కోసం రాయచోటి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నేతలు హామీలు ఇస్తున్నారే తప్ప వాటిని తీర్చడం లేదని ప్రజలు వాపోతున్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,50,628 మంది. వీరిలో పురుషులు 1,24,087 మంది.. మహిళలు 1,26,515 మంది. ముస్లింలు, శెట్టి బలిజ, రెడ్డి సామాజిక వర్గం రాయచోటిలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ సెగ్మెంట్ పరిధిలో సంబేపల్లి, చిన్నమండెం, రాయచోటి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలున్నాయి. 

రాయచోటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. శ్రీకాంత్ రెడ్డిదే హవా :

భిన్నమైన పరిస్థితులు వుండే రాయచోటిలో పలు పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. తొలుత కాంగ్రెస్ హవా ఇక్కడ నడిచింది. హస్తం పార్టీ 7 సార్లు, వైసీపీ మూడు సార్లు, టీడీపీ రెండు సార్లు, ఇతరులు నాలుగు సార్లు రాయచోటిలో విజయం సాధించారు. రాయచోటిలో గడికోట, రెడ్డప్ప కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. తొలుత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి.. వైఎస్ మరణం తర్వాత జగన్‌తో కలిసి నడిచారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన గడికోట.. 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీకాంత్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి తనకు రాయచోటిలో తిరుగులేదని నిరూపించారు. 

రాయచోటి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ వ్యూహాలు :

తనకు కంచుకోటలా మారిన రాయచోటిని ఎట్టిపరిస్ధితుల్లోనూ వదులుకోకూడదని జగన్ భావిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫర్మ్ చేసిన ఆయన.. తన మిత్రుడి విజయం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముస్లిం, రెడ్డి, దళిత ఓటర్ల మద్ధతు పుష్కళంగా వుండటం శ్రీకాంత్ రెడ్డికి కలిసివచ్చే అంశం. అలాగే వలసలను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించడంతో నియోజకవర్గంలో ఆయనకు మంచిపేరు తీసుకొచ్చింది.

అయితే వరుసగా నాలుగు సార్లు గెలవడంతో వ్యతిరేకత సైతం అదే స్థాయిలో వుందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. 1999, 2004లో వరుస విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ.. శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత రాయచోటిలో పట్టు కోల్పోయింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్‌తో పొత్తు కారణంగా బలమైన బలిజ సామాజికవర్గం మద్ధతు లభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో నిలిచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu