
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తన ప్రచారంలో టెక్నాలజీకి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్వీట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో జగన్ ఆలోచలు, నవరత్నాలు వంటి పథకాల గూర్చి వివరిస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు కవులు జగన్ త్వరలో జరగాల్సిన అవసరాన్ని వివరిస్తూ ‘‘రావాలి జగన్...కావాలి జగన్’’ అంటూ ఓ పాటను రాశారు. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు.
సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సూర్య నారాయణరావులు హాజరయ్యారు.
దీనిని Jagananna for CM వెబ్‌సైట్‌లో ఉంచారు. విడుదల చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ పాట వైరల్ అయ్యింది. వైసీపీ అభిమానులు దీనిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
పాట కోసం డౌన్‌లోడ్ చేయాలనుకుంటే: రావాలి జగన్.. కావాలి జగన్