ఒంగోలులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: పోలీసులకు గాయాలు

By narsimha lodeFirst Published Feb 25, 2019, 3:27 PM IST
Highlights

ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో సోమవారం నాడు టీడీపీ, వైసీపీ  కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లతో, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
 

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో సోమవారం నాడు టీడీపీ, వైసీపీ  కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లతో, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

ఒంగోలు పట్టణంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సుమారు మూడు గంటల పాటు పైగా  ఘర్షణ జరిగింది. పట్టణంలోని కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు గాను వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చే ప్రయత్నం చేయడంతో... టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు.

ఎమ్మెల్యేగా ఉన్న  కాలంలో కమ్మ పాలెనికి ఏం చేశారని  టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు.వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకొంది.  రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడికి దిగారు. 

ఒకరిపై మరోకరు చెప్పులతో  దాడులకు దిగారు. ఈ ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఓ మహిళ కానిస్టేబుల్ గాయాలతో ఆసుపత్రిలో చేరింది. మరో కానిస్టేబుల్‌ తలకు రాయి తగిలింది.దీంతో తలకు గాయమైంది. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
 

click me!