నరుకుతామన్నారు, ఇవే ఆధారాలు.. పరిటాలపై కేసుపెట్టండి: పోలీసులకు తోపుదుర్తి ఫిర్యాదు

By Siva KodatiFirst Published Mar 16, 2020, 4:03 PM IST
Highlights

తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. తండ్రి బాటలో హింసా రాజకీయాలను చేయాలని పరిటాల శ్రీరామ్‌ కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు

తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. తండ్రి బాటలో హింసా రాజకీయాలను చేయాలని పరిటాల శ్రీరామ్‌ కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు.

సోమవారం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీరామ్ వైసీపీ కార్యకర్తల తలలు నరుకుతానంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజ్‌ని తోపుదుర్తి ఎస్పీకి అందజేశారు.

Also Read:టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్ బై... క్లారిటీ ఇచ్చిన శ్రీరామ్

అనంతరం ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పరిటాల శ్రీరామ్‌ను దౌర్జన్యాలను ఖండిస్తున్నామని, రామగిరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్ తనకు తానుగా అంగీకరించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

తలలు నరుకుతామంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని ప్రకాశ్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ లేదని, ఎల్లో వైరస్ ఉందని తోపుదుర్తి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వైరస్ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేశ్ ‌చౌదరి కుమార్తెకి చంద్రబాబు ఆర్ధికమండలి డైరెక్టర్ పదవి ఇచ్చారని అందుకే రమేశ్ టీడీపీ అధినేత రుణం తీర్చుకుంటున్నారని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టారని ప్రకాశ్ రెడ్డి ప్రశంసించారు. ఓడిపోతామనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

Also Read:''పరిటాల హత్య జేసి కుట్రే... తుపాకులు సమకూర్చింది ఆయనే...''

రాష్ట్రానికి రూ.5,000 కోట్లు రాకూడదనే ప్రతిపక్షనేత కుట్రలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని తోపుదుర్తి ప్రశ్నించారు. వైసీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, కేశవ రెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు.

ఆయన తండ్రి పరిటాల రవి వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలని మాధవ్ సవాల్ విసిరారు. 

click me!