బహిర్భూమికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం... అధికార పార్టీ నాయకుడి నిర్వాకం

Arun Kumar P   | Asianet News
Published : Aug 24, 2021, 10:06 AM IST
బహిర్భూమికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం... అధికార పార్టీ నాయకుడి నిర్వాకం

సారాంశం

మహిళపై అత్యాచారానికి యత్నించడమే కాదు అందుకు సహకరించని మహిళపై అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు ఓ రాజకీయ పార్టీ నాయకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఒంగోలు: బహిర్బూమికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు అధికార పార్టీ నాయకుడు. అయితే మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన సదరు నాయకుడు ఆమెపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు అదే గ్రామానికి చెందిన మహిళపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన సదరు మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు. కానీ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. 

read more  ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి... చాక్లెట్ ఆశచూపి, పక్కకు తీసుకెళ్లి దారుణం..

తన వాంఛ తీర్చుకోనివ్వకుండా అడ్డుకుందని తీవ్ర ఆగ్రహానికి గురయిన అతడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కిరాతకంగా దాడి చేయడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయాలతో ఇంటికి చేరుకున్న మహిళను కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు.  

తనపై జరిగిన అత్యాచారయత్నం, దాడి గురించి బాధిత మహిళ కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అధికార పార్టీ నేత అఘాయిత్యానికి యత్నించడంపై గ్రామస్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్