పదేళ్ల బాలికపై వైసిపి యువకుల అత్యాచారయత్నం... చంద్రబాబు సీరియస్ (వీడియో)

Published : Aug 06, 2020, 08:24 PM IST
పదేళ్ల బాలికపై వైసిపి యువకుల అత్యాచారయత్నం... చంద్రబాబు సీరియస్ (వీడియో)

సారాంశం

రాజమండ్రిలో 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. 

రాజమండ్రి రూరల్ లో 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. 16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన మరువక ముందే జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. అత్యాచారయత్నం చేసింది వైసీపీకి చెందినవారిగా గుర్తించారు. 

అయితే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే చంపేస్తామని బెదిరించడంతో తల్లిదండ్రులు కామ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు గురిచేస్తుండడం, చంపేస్తామని బెదిరిస్తుండడంతో తమను జగనే కాపాలంటూ ఆ బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ తల్లిదండ్రులు ఆవేదనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన బాధిత కుటుంబానికి అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 

రెచ్చిపోతున్న వైసీపీ.. పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చంపేస్తామని బెదిరింపులు..

''రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలీని 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసిపి యువకుల అత్యాచారాయత్నాన్ని ఖండిస్తున్నాం. పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులా? ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?'' అని జగన్ సర్కాన్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.  

 

''16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉంది. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. దిశచట్టం అసలు అమల్లో ఉందా? ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu