గుంటూరు జిల్లాలోని చుండూరు మండలం పెదగాదెలవర్రులో ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.
చుండూరు: గుంటూరు జిల్లాలోని చుండూరు మండలం పెదగాదెలవర్రులో ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.
పెదగాదెలపర్రుకు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వయస్సు ఏడేళ్లు. చిన్న కూతురు వయస్సు ఐదేళ్లు. పెద్ద కూతురు అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతుంది. చిన్న కూతురు అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తోంది.
వీరి ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల బాలుడి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ బాలుడు కొల్లూరు మండలం చిలుమూరు హాస్టల్ లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు.
మంగళవారం నాడు మధ్యాహ్నం బాధిత బాలిక ఆమె చెల్లెలు ఇంటి సమీపంలో అడుకొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మైనర్ బాలుడు ఏడేళ్ల బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
అయితే బాలిక బిగ్గరగా అరుస్తూ అక్కడి నుండి బయటకు పరుగెత్తింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయాన్ని చెప్పింది.
ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు బాలుడి కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి కొడుకును కొట్టాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. బాలుడితో పాటు అతని తల్లిదండ్రులు కూడ గ్రామం నుండి పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు.