శవాన్ని తీసికెళ్లం: మంత్రి సుచరిత ముందు బోరున విలపించిన రమ్య తల్లిదండ్రులు

Published : Aug 16, 2021, 11:18 AM ISTUpdated : Aug 16, 2021, 11:19 AM IST
శవాన్ని తీసికెళ్లం: మంత్రి సుచరిత ముందు బోరున విలపించిన రమ్య తల్లిదండ్రులు

సారాంశం

పరామర్శకు వచ్చిన హోం మంత్రి సుచరిత ముందు మృతురాలు రమ్య తల్లిదండ్రులు బోరున విలపించారు. శశికృష్ణను శిక్షించేవరకు జిజిహెచ్ నుంచి రమ్య శవాన్ని తీసుకుని వెళ్లేది లేదని భీష్మించుకున్నారు.

గుంటూరు: ప్రేమోన్మాది శశికృష్ణ చేతిలో హత్యకు గురైన గుంటూరు బిటెక్ విద్యార్థిని రమ్య తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులూ కార్యకర్తలూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రమ్య తల్లిదండ్రులను పరామర్శించడానికి హోం మంత్రి మేకతోటి సుచరిత ఆస్పత్రికి వచ్చారు. సుచరిత ముందు తల్లిదండ్రులు బోరున విలపించారు. పది లక్షల రూపాయలు రమ్య తల్లిదండ్రులకు అందించడానికి వచ్చారు. తొలుత వారు డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, అధికారులు నచ్చజెప్పడంతో వారు తీసుకున్నారు. అయితే, శశికృష్ణను ఎన్ కౌంటర్ చేయాలని రమ్య తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

శశికృష్ణను బహిరంగంగా శిక్షించేవరకు జిజిహెచ్ ఆస్పత్రి నుంచి తీసుకుని వెళ్లేది లేదని భీష్మించుకున్నారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేసినప్పుడు, వారిని పట్టుకోనప్పుడు ప్రభుత్వాన్ని నిందించడానికి వీలుంటుందని సుచరిత చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి పది లక్షల రూపాయలు పంపించారని ఆమె చెప్పారు. 

తన కూతురిని కత్తితో పొడుస్తుంటే ఎవరూ ఆపలేదని, హత్యాకాండను చూస్తూ మిన్నకుండిపోయారని రమ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు శవాన్ని ఆస్పత్రి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలావుంటే, బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణ పోలీసులు పట్టుకునే సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతు కోసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను స్వల్పంగా గాయపడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శశికిరణ్ ను పోలీసులు ముప్పాళ్లమండలం గోళ్లపాడు సేఫ్ కంపెనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. రమ్య హత్యకు వాడిన కత్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దళిత విద్యార్థిని రమ్య దారుణ హత్యకు నిరసనగా మంగళగిరి నియోజకవర్గం తెలుగు మహిళ ఆధ్వర్యంలో మంగళగిరి గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే యువతి దారుణ హత్యకు గురి కావడం దారుణమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. 

దిశ శకటాలకు బహుమతులు ఇవ్వడం కాదు అడబిడ్డలకు భరోసాను, భద్రతను ఇవ్వాలని అన్నారు. దళితులపై నిత్యం హత్యాకాండ, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు , హోం మంత్రి సుచరితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. 

ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతుోదంని వారన్నారు. దిశ పోలీసులు ఏమయ్యారని వారు అడిగారు. రాష్ట్రంలో ఏం జరుగతున్నా కూడా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu