:లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికి మూడు రాష్ట్రాలు దాటి గుంటూరుకు చెందిన యువకుడు రామకృష్ణ స్వంత జిల్లాకు చేరుకొన్నాడు. అయితే వెంటనే అతడిని క్వారంటైన్ కి తరలించారు.
గుంటూరు:లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికి మూడు రాష్ట్రాలు దాటి గుంటూరుకు చెందిన యువకుడు రామకృష్ణ స్వంత జిల్లాకు చేరుకొన్నాడు. అయితే వెంటనే అతడిని క్వారంటైన్ కి తరలించారు.
గుంటూరు పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన రామకృష్ణ మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో తాను పనిచేసే కంపెనీలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
undefined
మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. పని కూడ లేదు. దీంతో తన స్వంత గ్రామానికి చేరుకోవాలని భావించాడు. మహారాష్ట్ర నుండి కంటైనర్ వాహనంలో హైద్రాబాద్ కు చేరుకొన్నాడు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: శ్రీకాకుళంలో గర్భిణీ కష్టాలు, డోలిలో మోసుకెళ్లారు...
హైద్రాబాద్ నుండి మరో వాహనంలో విజయవాడకు చేరుకొన్నాడు. విజయవాడ నుండి గుంటూరుకు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు.హైద్రాబాద్ నుండి విజయవాడకు వచ్చే సమయంలో ద్విచక్ర వాహనాన్ని సిద్దం చేయాలని తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు.
ద్విచక్రవాహనం ద్వారా రామకృష్ణ గుంటూరుకు వచ్చాడు. ఈ విషయం ఇరుగు పొరుగు ద్వారా వార్డు వలంటీర్లకు తెలిసింది.దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఈ విషయమై అధికారులు, వైద్య సిబ్బంది రామకృష్ణ ఇంటికి వచ్చి ఆయనను క్వారంటైన్ కు తరలించారు.