రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Published : Mar 15, 2024, 08:12 PM ISTUpdated : Mar 15, 2024, 08:17 PM IST
రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

కోనసీమ జిల్లా రాజకీయాల్లో కాకరేపిన నియోజకవర్గం రామచంద్రపురం. ఇక్కడ ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఆయనను మరో నియోజకవర్గానికి మార్చి ఈ సీటును మాజీ మంత్రి తనయుడికి కేటాయించారు వైసిపి అధినేత. వైసిపిలో వర్గపోరు నేపథ్యంలో రామచంద్రపురం సీటు హాట్ టాపిక్ గా మారింది.

రామచంద్రపురం రాజకీయాలు : 

రామచంద్రపురం వైసిపిలో హేమాహేమీ నాయకులు వున్నారు. మాజీ డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పిల్లి, చెల్లుబోయిన ఈసారి రామచంద్రపురం టికెట్ ఆశించారు... అయితే వైసిపి అధిష్టానం మాత్రం పిల్లికే జై కొట్టింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ ను రామచంద్రపురం బరిలో నిలిపింది. 

ఇక తెలుగుదేశం పార్టీ రామచంద్రపురంలో కాస్త బలహీనంగా వుందనే చెప్పాలి. గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహించిన తోట త్రమూర్తులు ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్నారు. దీంతో టిడిపి కొత్త నాయకున్ని రామచంద్రపురం పోటీలో నిలిపింది. అయితే టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తుండటం రామచంద్రపురం వంటి నియోజకవర్గాల్లో ప్రభావం చూపనుంది. 

రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. కాజులూరు 
2. పామర్రు 
3. రామచంద్రపురం 
 
రామచంద్రపురం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌-  1,93,867

పురుషులు -  96,834

మహిళలు ‌- 97,026

రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

రామచంద్రపురం అసెంబ్లీ సీటుకోసం వైసిపిలో కీలక నాయకులు పోటీపడ్డారు. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న మంత్రి చెల్లుబోయినకు కాదని వైసిపి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ రామచంద్రపురం టికెట్ దక్కింది. చెల్లుబోయినను రాజమండ్రి రూరల్ కు మార్చారు. 

 టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ వాసంశెట్టి సుభాష్ ను రామచంద్రపురం అభ్యర్థిగా ప్రకటించింది. 2014 లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైసిపిలో వున్నారు. దీంతో సుభాష్ కు అవకాశం ఇచ్చింది టిడిపి.  

రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,68,891

వైసిపి - చెల్లుబోయిన వూణుగోపాలకృష్ణ - 75,365 (44 శాతం) - 5,168 ఓట్ల మెజారిటీతో విజయం 
 
టిడిపి - తోట త్రిమూర్తులు ‌- 70,197 (41 శాతం) ‌- ఓటమి

రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,60,133 (88 శాతం)

టిడిపి - తోట త్రిమూర్తులు - 85,254 (53 శాతం) ‌- 16,922 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - పిల్లి సుభాష్ చంద్రబోస్ - 68,332 (42 శాతం) - ఓటమి 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Botsa Satyanarayana Pressmeet: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ సెటైర్లు | Asianet Telugu
Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu