రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: బీజేపీకి జైకొట్టిన జగన్

By team teluguFirst Published Sep 10, 2020, 8:11 PM IST
Highlights

కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీలు జగన్ తో ఫోన్ లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో హరివంశ్ నారాయణ్ కు మద్దతు విషయంగా చర్చించినట్టు తెలియవచ్చింది.  ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలికేందుకు జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ నోప్మినషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన 2018లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ ని ఓడించి ఆ పదవిని దక్కించుకున్నప్పటికీ.... ఈ ఏప్రిల్ తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవి కలం ముగిసింది. దీనితో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 

ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ ను నిలబెట్టిన బీజేపీ..... సెప్టెంబర్ 14న జరిగే ఎన్నిక కోసం ఇప్పటికే తమ పార్టీ నేతలకు విప్ ను జారీ చేసింది. అంతే కాకుండా సభలోని మిగిలిన ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. 

ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా చర్చించారు బీజేపీ నేతలు. అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీలు జగన్ తో ఫోన్ లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో హరివంశ్ నారాయణ్ కు మద్దతు విషయంగా చర్చించినట్టు తెలియవచ్చింది. 

ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలికేందుకు జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. రాజ్యసభలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీకి ఆరుగురు సభ్యులున్నారు. పూర్తి మెజారిటీ బీజేపీకి లేనందున ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి ఉంది. 

ఇందుకోసం మద్దతు కూడగట్టేందుకు జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ పెద్దలు మాట్లాడి ఒప్పించినట్టుగా తెలియవస్తుంది. బిజెపితో సంబంధాలపై తన వైఖరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పార్టీ బిజెపితో ఏ విధమైన సంబంధాలను కొనసాగిస్తుందనే విషయాన్ని వెల్లడించారు. 

తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అదే మార్గంలో వెళ్తామని ఆయన చెప్పారు. ప్రతి అంశంలోనూ తాము అదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ విషయంపై తాము పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు తెలిపారు. బిజెపికి తాము అంశాలవారీగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తమ ఏ కొంచెం మద్దతు ఇచ్చినా కూడా అన్ని విధాలుగా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన తమ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే పనిలో ఉన్నామని ఆయన అన్నారు.

click me!