బంగాళఖాతంలో అల్పపీడనం...రాగల నాలుగురోజులూ ఏపీలో వర్షాలు

By Arun Kumar PFirst Published Aug 3, 2020, 12:29 PM IST
Highlights

 మంగళవారం నుంచి 3-4 రోజులు దక్షిణ, మధ్యభారతంలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

అమరావతి: తూర్పు, పడమర మధ్య విస్తరించిన ద్రోణి ఆదివారం ఉత్తర కోస్తాపై ఆవరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ నెల 4వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని... ఈ రెండింటి ప్రభావంతో అరేబియాసముద్రంలో రుతుపవన కరెంట్‌ బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 

దీంతో మంగళవారం నుంచి 3-4 రోజులు దక్షిణ, మధ్యభారతంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే కో స్తాలో వర్షాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

గతకొద్ది రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీటిపారుదల రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.  


 

click me!