ఉద్యోగుల సభలో రఘువీరా వర్సెస్ పార్థసారథి

By rajesh yFirst Published Sep 1, 2018, 3:26 PM IST
Highlights

 ఉద్యోగుల పంతం-సీపీఎస్ అంతం అనే నినాదంతో విజయవాడలో ఉద్యోగులు తలపెట్టిన సభలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లొల్లి చేశాయి. సీపీఎస్ విధానాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తనదైన శైలిలో వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీపై చురకలు వేశారు. 

విజయవాడ: ఉద్యోగుల పంతం-సీపీఎస్ అంతం అనే నినాదంతో విజయవాడలో ఉద్యోగులు తలపెట్టిన సభలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లొల్లి చేశాయి. సీపీఎస్ విధానాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తనదైన శైలిలో వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీపై చురకలు వేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల వద్ద, వేదికల వద్ద అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం కాదని అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదియ్యాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో అధికార పార్టీపై పోరాడాల్సిన వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పాదయాత్రలు చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించడం అవివేకమన్నారు రఘువీరారెడ్డి. 

రఘువీరారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీమంత్రి పార్ధసారధి మండిపడ్డారు. సీపీఎస్ రద్దుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిపారు. తమ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే దాన్ని రాజకీయం చెయ్యడం తగదని హితవు పలికారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మరోవైపు ఉద్యోగులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి సీపీఎస్ విధానంపై పోరాడాలని సూచించారు.    

click me!