ఏపీలో అందని జీతాలు.. ఉద్యోగుల ఆందోళన

Published : Sep 01, 2018, 02:04 PM ISTUpdated : Sep 09, 2018, 12:41 PM IST
ఏపీలో అందని జీతాలు.. ఉద్యోగుల ఆందోళన

సారాంశం

ఈ నెల మాత్రం అలా అనుకున్న సమయానికి ఉద్యోగులకు జీతం అందలేదు. ఇందుకు రిజర్వ్‌బ్యాంకులో సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. 

ఏపీలోని చాలా మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు అందలేదు. దీంతో.. వారంతా ఆందోళనకు గురయ్యారు. మాములుగా అయితే.. నెల చివరి రోజు లేదా.. ఫస్ట్ తారీఖున ఉద్యోగులందరికీ జీతాలు అందుతాయి. కానీ ఈ నెల మాత్రం అలా అనుకున్న సమయానికి ఉద్యోగులకు జీతం అందలేదు. ఇందుకు రిజర్వ్‌బ్యాంకులో సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. 

సాధారణంగా ప్రతీ నెల 30, 31 అర్ధరాత్రిలోగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు డిపాజిట్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్ఎమ్‌ఎస్ ద్వారా మూడు రోజుల క్రితమే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఫైళ్లను రిజర్వ్ బ్యాంక్ అధికారులకు అందజేశారు. 4.5లక్షల మంది ఉద్యోగులు, 3.6లక్షల మంది పెన్షనర్ల ఫైళ్లను అందుకున్నట్లు రిజర్వ్‌బ్యాంకు ధృవీకరించింది. కాగా 31 అర్ధరాత్రి జీతాలు డిపాజిట్ అవకపోవడంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు సంప్రదింపులు జరిపారు.
 
కాగా నిన్న సాయంత్రం నుంచి రిజర్వ్‌బ్యాంకులో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన అధికారులు ఈ లోపాన్ని సరిచేసి ఉదయం పది గంటలలోపు జీతాలు డిపాజిట్ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. మధ్యాహ్నం వరకు జీతాలు డిపాజిట్ అవకపోవడంతో మరోసారి ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు... రిజర్వ్‌బ్యాంకు అధికారుల దృష్టికి  తీసుకెళ్లారు. అయితే ఆర్బీఐ సర్వర్లు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయని ఈరోజు రాత్రి వరకు లేదా రేపు ఉదయానికి పెన్షన్లు, వేతనాలు పడే అవకాశం ఉందని వారు తెలియజేశారు. అయితే రేపు ఆదివారం కావడంతో ఆర్బీఐ సాంకేతి సిబ్బంది విధులు నిర్వహిస్తుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations