ఆదిత్యానాథ్ దాస్ కు రఘురామ కృష్ణమ రాజు భార్య రమాదేవి ఫోన్

By telugu teamFirst Published May 17, 2021, 7:42 PM IST
Highlights

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు భార్య రమాదేవి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఫోన్ చేశారు. తన భర్త రఘురామకు ప్రాణ హాని ఉందని రమాదేవి అన్నారు.

గుంటూరు: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి ఫోన్ చేశారు. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. 

దీంతో వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకు జాప్యం చేసే ధోరణిలో కనిపించిన ప్రభుత్వ వర్గాలు రఘురామను హైదరాబాద్ తరలించేందుకు రంగం సిద్ధం చేశాయి.

ఇదిలావుంటే, గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు తరలించారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను పోలీసులు తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది. 

రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. 

వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.  వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో తమకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలు జరిగిన తీరును వీడియో తీసి తమకు అందించాలని కూడా ఆదేశించింది. 

click me!