రఘురామ కృష్ణమ రాజు కేసు: సుప్రీం తలుపు తట్టిన టీవీ5 టీవీ చానెల్

By telugu teamFirst Published May 17, 2021, 7:59 PM IST
Highlights

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుపై నమోదు చేసిన కేసులో తమను చేర్చడంపై టీవీ5 యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమపై సిఐడి దర్యాప్తు జరగకుండా స్టే ఇవ్వాలని కోరింది.

న్యూఢిల్లీ: వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కేసులో ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ5 సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రఘురామ కృష్ణమ రాజు కేసులో టీవీ5ను ఏ2గా, ఎబీఎన్ చానెల్ ను ఏ3గా సీఐడి ఎఫ్ఐర్ నమోదు చేసింది. రఘురామకృష్ణమ రాజుతో కలిసి ఆ రెండు టీవీ చానెళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కుట్ర చేశాయని కేసు నమోదు చేసింది. 

ఈ నేపథ్యంలో టీవీ5 న్యూస్ చానెల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రఘురామ కృష్ణమ రాజు విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడి అధికారులు కేసు నమోదు చేశారని, ఉద్దేశ్యవూర్వకంగానే తమ చానెల్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చారని టీవీ5 సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తెలిపింది. 

సంస్థపై, సంస్థ ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని చానెల్ సుప్రీంకోర్టును కోరింది. సిైడి దర్యాప్తుపై స్టే విధించాలని కూా టీవీ5 న్యూస్ చానెల్ యాజమాన్యం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

ఇదిలావుంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామక కృ్ణమ రాజును సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. తనను సిఐడి కస్టడీలో కొట్టడం వల్ల గాయాలయ్యాయని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆర్మీ ఆస్పత్రికి పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాత్రి పది గంటల ప్రాంతంలో ఆయన సికింద్రాబాదుకు చేరుకునే అవకాశం ఉంది.

click me!