కాబోయే భర్త గొంతు కోసిన యువతి: రామునాయుడిపైనే యువతి పేరేంట్స్ ఆరోపణలు

Published : Apr 19, 2022, 04:58 PM ISTUpdated : Apr 19, 2022, 05:08 PM IST
కాబోయే భర్త గొంతు కోసిన యువతి: రామునాయుడిపైనే యువతి పేరేంట్స్ ఆరోపణలు

సారాంశం

అనకాపల్లి రావికమతంలో కాబోయే భర్త గొంతు కోసిన ఘటనపై రాము నాయుడిపై యువతి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. తమ బిడ్డపై అనవసరంగా నిందలు మోపుతున్నారన్నారు.  

విశాఖపట్టణం: Anakapalle జిల్లా Ravikamathamలో  కాబోయే భర్త గొంతును యువతి కోసిందనే ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకొంది.  రాము నాయుడిపై యువతి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

సోమవారం నాడు తమ ఇంటికి Ramu Naidu వచ్చాడన్నారు. బయటకు వెళ్లాలని తమ కూతురును తీసుకెళ్లేందుకు రాము నాయుడు  తన అనుమతి అడిగారన్నారు. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో వద్దని తమ కూతురు చెప్పిందన్నారు.  బర్త్‌డే గిఫ్ట్ ఇప్పిస్తానని తీసుకెళ్లాడని Pushpa తల్లి చెప్పారు.  అయితే గిఫ్ట్ కొనే పరుతో చాలా దూరం తీసుకెళ్లారన్నారు. అయితే తాను తమ కూతురికి ఫోన్ చేయడంతో ఇంటికి వస్తామని చెప్పిందన్నారు. అయితే తాను పోన్ చేసిన 15 నిమిషాలకే తన కూతురు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని పోన్ చేయడంతో ఆసుపత్రికి వచ్చినట్టుగా పుష్ప తల్లి మీడియాకు చెప్పారు. అయితే గిఫ్ట్ ఇప్పించే పేరుతో తమ కూతురిని బయటకు తీసుకెళ్లి చాకు కోనిపించాడని ఆమె చెప్పారు. చాకు ఎందుకని తమ కూతురు అడిగితే తర్వాత చెబుతానని తీసుకెళ్లాడని పుష్ప తల్లి చెబుతున్నారు.  యాక్సిడెంట్ లోనే రాము నాయుడికి గాయాలయ్యాయని పుష్ప తల్లి మీడియాకు చెప్పారు. తమ కూతురిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరుకు చెందిన రాము నాయుడికి రావికమతం గ్రామానికి చెందిన యువతి పుష్పకు పెద్దలు ఈ ఏడాది మే 28న వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వీరిద్దరికి కూడా నిశ్చితార్ధం కూడా చేశారు. రాము నాయుడు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో  పని చేస్తున్నాడు.  మూడు రోజుల క్రితం రాము నాయుడు హైద్రాబాద్ నుండి  స్వగ్రామానికి ఇంటికి వచ్చాడు.  అయితే రాము నాయుడు పుష్ప ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పుష్పనుపోీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు .

తాను పెళ్లి చేసకుోనని దేవుడి భక్తురాలిగా ఉంటానని యువతి పేరేంట్స్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయినా కూడా ఆ యువతికి పెళ్లి చేయాలని పేరేంట్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెళ్లికి పేరేంట్స్ బలవంతంగా ఏర్పాట్లు చేస్తుండడంతో పెళ్లి కొడుకును చంపాలని ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో యువతి ఒప్పుకుంది.

PREV
click me!

Recommended Stories

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
TDP MLA Miriyala Sirisha Devi Emotional Speech About Pawan Kalyan | Adavi Thalli Bata 2.0