‘పుష్ప’’యే నిందితురాలు: దేవుడి సేవలోనే వుండాలని, కాబోయే భర్త గొంతు కోసి... నేరం ఒప్పుకున్న యువతి

Siva Kodati |  
Published : Apr 19, 2022, 05:40 PM ISTUpdated : Apr 19, 2022, 05:42 PM IST
‘పుష్ప’’యే నిందితురాలు: దేవుడి సేవలోనే వుండాలని, కాబోయే భర్త గొంతు కోసి... నేరం ఒప్పుకున్న యువతి

సారాంశం

అనకాపల్లిలో కాబోయే భర్తపై హత్యాయత్నం చేసిన కేసును ఛేదించారు పోలీసులు. రామునాయుడుపై తానే హత్యాయత్నం చేసినట్లు నిందితురాలు పుష్ప అంగీకరించింది. పెళ్లి ఇష్టం లేకనే ఇలా చేసినట్లు చెప్పింది. 

అనకాపల్లిలో (anakapalle) కాబోయే భర్తపై హత్యాయత్నం చేసిన కేసులో మరో మలుపు తిరిగింది. రామునాయుడుపై (ramu naidu) దాడి చేసిన యువతి పుష్ప అంగీకరించింది. భక్తి మైకంలో వుండిపోయిన ఆమె.. తనకు పెళ్లి వద్దని, తాను దేవుడి భక్తురాలిగానే వుండిపోతానని తల్లిదండ్రులకు  చాలా సార్లు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే  రెండు పెళ్లి చూపులు రద్దు కావడంతో మూడోసారి పుష్పను ఒప్పించారు తల్లిదండ్రులు. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిన  పుష్ప.. కాబోయే భర్తను బయటకు తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గుడి దగ్గర రామునాయుడు కళ్లకు చున్నీ కట్టి... గొంతు కోసినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది పుష్ప. 

అంతకుముందు రామూనాయుడిపైనే పుష్ప (pushpa) తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. బయటకు వెళ్లాలని తమ కూతురును తీసుకెళ్లేందుకు రాము నాయుడు తమ అనుమతి అడిగారన్నారు. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో వద్దని తమ కూతురు చెప్పిందన్నారు.  బర్త్‌డే గిఫ్ట్ ఇప్పిస్తానని తీసుకెళ్లాడని Pushpa తల్లి చెప్పారు.  అయితే గిఫ్ట్ కొనే పేరుతో చాలా దూరం తీసుకెళ్లారన్నారు. అయితే తాను తమ కూతురికి ఫోన్ చేయడంతో ఇంటికి వస్తామని చెప్పిందన్నారు. 

అయితే తాను ఫోన్ చేసిన 15 నిమిషాలకే తన కూతురు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేయడంతో ఆసుపత్రికి వచ్చినట్టుగా పుష్ప తల్లి మీడియాకు చెప్పారు. అయితే గిఫ్ట్ ఇప్పించే పేరుతో తమ కూతురిని బయటకు తీసుకెళ్లి చాకు కోనిపించాడని ఆమె చెప్పారు. చాకు ఎందుకని తమ కూతురు అడిగితే తర్వాత చెబుతానని తీసుకెళ్లాడని పుష్ప తల్లి చెబుతున్నారు.  యాక్సిడెంట్‌లోనే రాము నాయుడికి గాయాలయ్యాయని పుష్ప తల్లి మీడియాకు చెప్పారు. తమ కూతురిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

కాగా.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరుకు చెందిన రాము నాయుడికి రావికమతం గ్రామానికి చెందిన యువతి పుష్పకు పెద్దలు ఈ ఏడాది మే 28న వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వీరిద్దరికి కూడా నిశ్చితార్ధం కూడా చేశారు. రాము నాయుడు హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో  పని చేస్తున్నాడు.  మూడు రోజుల క్రితం రాము నాయుడు హైద్రాబాద్ నుండి  స్వగ్రామానికి ఇంటికి వచ్చాడు.  అయితే రాము నాయుడు పుష్ప ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్