బండరాయితో మోది హత్య... అనంతరం అత్యాచారం

Published : Aug 24, 2019, 08:43 AM IST
బండరాయితో మోది హత్య... అనంతరం అత్యాచారం

సారాంశం

రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉన్న సరోజమ్మ(65) తలపై ఆనంద్‌ బండరాయి వేసి కర్రలతో కొట్టి చంపేశాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా అత్యాచారం చేసి, మెడలోని మంగళసూత్రాన్ని, బంగారు ఆభరణాలను తీసుకెళ్లాడు. 

ఒంటరిగా ఉన్న మహిళలే అతడి టార్గెట్. చుట్టు పక్కల ఎవరూ లేకుండా ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అతనిలోని సైకో కిల్లర్ నిద్రలేస్తాడు. బండ రాయితో మోదీ హత్య చేశాడు. చనిపోయారని నిర్థారించుకున్నాక అత్యాచారం చేస్తాడు. అనంతరం వారి ఒంటిపై ఉన్న నగలను చోరీ చేస్తాడు. కాగా ఇప్పటి వరకు ముగ్గురు మహిళలను దారుణంగా హత్య చేశాడు. కాగా.. సైకోని తాజాగా చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...నగరి మండలం ఎంఎన్‌ కండ్రిగకు చెందిన సరోజమ్మ, గోపాలరెడ్డి భార్యాభర్తలు. పందుల వ్యాపారం చేసేవాడు. భార్యతో విభేదాల కారణంగా ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటోంది. ఆమెను చంపేయాలని నిర్ణయించుకుని.. కిరాయి హంతకుడైన తమిళనాడు వేలూరు జిల్లా అరక్కోణం టౌన్‌కు చెందిన ఆర్‌.ఆనంద్‌తో రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆనంద్‌ రూ.5వేలు అడ్వాన్సు కూడా తీసుకున్నాడు.
 
ఈ మేరకు ఈ ఏడాది జూన్‌ 24వ తేదీన రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకుని ఉన్న సరోజమ్మ(65) తలపై ఆనంద్‌ బండరాయి వేసి కర్రలతో కొట్టి చంపేశాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా అత్యాచారం చేసి, మెడలోని మంగళసూత్రాన్ని, బంగారు ఆభరణాలను తీసుకెళ్లాడు. మిగతా రూ.25 వేల కోసం గోపాలరెడ్డి వద్దకు రాగా.. తర్వాత ఇస్తానని చెప్పి పంపేశాడు. 

తర్వాత, ఆనంద్‌ పిచ్చాటూరు మండలం గోవర్దనగిరిలో.. జూలై 29వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సుభద్రమ్మ అనే మహిళ తలపై బండరాయితో కొట్టి గాయపరిచి.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఈ కేసులను సవాల్‌గా తీసుకున్న నగరి సీఐ సాయినాథ్‌ ఆధ్వర్యంలోని బృందం సైకో కిల్లర్‌ ఆనంద్‌ను, సరోజమ్మ హత్యకు ప్రోత్సహించిన భర్త గోపాలరెడ్డి(70)ని, కుమారుడు నరసింహులు(42)ను, దొంగిలించిన ఆభరణాలను కొన్న సి.మన్నన్‌లను అరెస్టు చేశారు. 

విచారణలో తమిళనాడులో ఆనంద్‌ మరో రెండు హత్యలు చేసినట్లు గుర్తించారు. అరక్కోణంలో ఓ వితంతువును చంపి అత్యాచారం జరిపాడు. అదే ప్రాంతంలో భరత్‌(8)అనే బాలుడిని కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలుపెట్టి చంపేసినట్లు తేలింది.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu