విశాఖపట్టణంలో సైకో హల్‌చల్: ఇద్దరిపై కత్తితో దాడి

Published : Oct 05, 2020, 06:31 PM ISTUpdated : Oct 05, 2020, 06:37 PM IST
విశాఖపట్టణంలో సైకో హల్‌చల్: ఇద్దరిపై కత్తితో దాడి

సారాంశం

: విశాఖపట్టణంలో  ఓ వ్యక్తి కత్తితో హల్ చల్ చేశాడు. ఓ మహిళతో పాటు చిన్నారిని కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో స్థానికులు సాక్ కు గురయ్యారు. కత్తితో స్థానికులను బెదిరించాడు. రోడ్డుపై హంగామా చేశాడు.

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో  ఓ వ్యక్తి కత్తితో హల్ చల్ చేశాడు. ఓ మహిళతో పాటు చిన్నారిని కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో స్థానికులు సాక్ కు గురయ్యారు. కత్తితో స్థానికులను బెదిరించాడు. రోడ్డుపై హంగామా చేశాడు.

విశాఖపట్టణంలోని కొమ్మాదిలోని అమరావతి కాలనీలో సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. కొమ్మాదిలో కత్తితో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. రొడ్డుపై వెళ్తున్న మహిళను, చిన్నారిని తన చేతిలోని కత్తితో పొడిచాడు. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుపై వెళ్తున్నవారిని ఆ వ్యక్తి కత్తితో బెదిరించాడు. సైకో ను స్థానికులు బంధించి చితకబాదారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.  సైకో దాడితో గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు.

కత్తితో ఆ వ్యక్తి ఎందుకు దాడికి దిగాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సైకో కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మహిళలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli