చూడండి: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సీ43 (వీడియో)

Published : Nov 29, 2018, 11:04 AM ISTUpdated : Nov 29, 2018, 11:07 AM IST
చూడండి: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సీ43 (వీడియో)

సారాంశం

అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి రుజువుచేసింది. ప్రతిష్టాత్మక పీఎస్ఎల్‌వీ-సీ43 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 

అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి రుజువుచేసింది. ప్రతిష్టాత్మక పీఎస్ఎల్‌వీ-సీ43 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.58 గంటలకు పీఎస్ఎల్‌వీ నిప్పులు కక్కుతూ కక్ష్య వైపుగా పయనించింది.

మనదేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలున్నాయి. ఈ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ఒకేసారి ప్రవేశపెట్టడం విశేషం.

ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ డా.శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. భారత్‌కు చెందిన హైపవరల్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ ద్వారా 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగు రంగుల చిత్రాలను హై రెజుల్యుషన్‌తో ఫోటోలు తీయవచ్చు.

ఈ ఉపగ్రహం వల్ల వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, సముద్రాలు, నదులుల్లోని లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భాలకు సంబంధించిన అనేక రకాల సేవలను అందించనుంది. 

 

PREV
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు