కృష్ణా జిల్లాలో డాక్టర్ రాధా హత్య కేసులో పురోగతి.. భర్త సుపారీ ఇచ్చి...

Published : Aug 10, 2023, 09:32 AM IST
కృష్ణా జిల్లాలో డాక్టర్ రాధా హత్య కేసులో పురోగతి.. భర్త సుపారీ ఇచ్చి...

సారాంశం

కృష్ణాజిల్లాలో కలకలం రేపిన డాక్టర్ రాధ హత్య కేసులో భర్తే నిందితుడని పోలీసులు తేల్చారు. భారీగా సుపారీ ఇచ్చి బార్యను హత్య చేయించాడు. 

కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లాలో గత నెల చివర్లో కలకలం సృష్టించిన డాక్టర్ రాధా హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. భర్త డాక్టర్ మహేశ్వర రావే.. సుపారీ ఇచ్చి భార్యను హత్య చేయించినట్లుగా పోలీసులు తేల్చారు.  రాధది సుపారి మర్డర్ గా నిర్ధారించారు. వారింట్లో పని చేసే డ్రైవర్ హంతకుడిగా తేల్చారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు దారి తీసినట్లుగా చెబుతున్నారు.

పైపులకు బిగించే ఇనపరాడుతో రాధ తలపై మోది హత్య చేశారు. ఆ తర్వాత అనుమానం రాకుండా ఆమె నగలను తీసుకుని…ఆధారాలు గుర్తుపట్టకుండా ఉండడం కోసం కారంపొడిచల్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీనికోసం మహేశ్వరరావు డ్రైవర్ కి భారీ మొత్తంలో సుపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఓ ల్యాబ్ అధినేతకు కూడా  సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

అనంతపురం సెబ్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్పొరేటర్ల హల్ చల్.. మహిళా కానిస్టేబుల్ తో అనుచిత ప్రవర్తన..

ఇదిలా ఉండగా, జులై 26న ఆంధ్రప్రదేశ్ లోని కృష్థా జిల్లా బందరులో దారుణ ఘటన వెలుగు చూసింది. నగల కోసం డాక్టర్ భార్యను దారుణంగా హత్య చేశారు. రాధ గొంతు కోసి, ఆమె ఒంటిపై నగలతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన స్థానిక వెంకటేశ్వర పిల్లల ఆస్పత్పిలో జరిగింది. వెంకటేశ్వర పిల్లల ఆస్పత్రిని డాక్టర్ మహేశ్వరరావు నడుపుతున్నారు. ఆస్పత్రిలోకి ప్రవేశించిన దుండగులు మహేశ్వరరావు భార్య కళ్లలో కారం కొట్టి, సుత్తితో దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత నగలతో పారిపోయారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిమీద విచారణ నిమిత్తం డాక్టర్ మహేశ్వరరావును కూడా స్టేషన్ కు తరలించారు. అతని దగ్గరున్న సెల్ ఫోన్లు తీసుకున్నారు. అయితే విచారణ సమయంలో సెల్ ఫోన్ ఇవ్వాలంటూ మహేశ్వరరావు పట్టుబట్టాడు. దీంతో ఆయన ప్రవర్తన మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu