Konaseema : హైవేపై దూసుకెళుతూ అదుపుతప్పి కాలేజీ బస్సు... తప్పిన పెనుప్రమాదం (వీడియో)

Published : Sep 13, 2023, 03:55 PM ISTUpdated : Sep 13, 2023, 03:58 PM IST
Konaseema : హైవేపై దూసుకెళుతూ అదుపుతప్పి కాలేజీ బస్సు... తప్పిన పెనుప్రమాదం (వీడియో)

సారాంశం

జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ప్రైవేట్ కాలేజీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయిన సంఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. 

కోనసీమ : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్ళింది. వేగంగా వెళుతూ బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని బోనం వెంకటా చలమయ్య(బివిసి) ఇంజనీరింగ్ కాలేజీకి విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పింది. సఖినేటిపల్లి నుండి అల్లవరం మండలం ఓడలరేవుకు వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది.  జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న బస్సు రాజోలు మండలం శివకోడు వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. 

వీడియో

కొబ్బరి తోటలోకి దూసుకెళ్లినా బోల్తా పడకుండా, చెట్లను ఢీకొట్టకుండానే బస్సు ఆగింది. దీంతో బస్సు డ్రైవర్ తో సహా విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ఎమర్జెన్సీ మార్గం ద్వారా బస్సులోని వారిని బయటకు తీసుకువచ్చారు. 

Read More  లోన్ కోసం వెళితే లోబర్చుకోబోయాడు... మహిళపై ఫైనాన్స్ సంస్థ యజమాని అత్యాచారయత్నం (వీడియో)

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థులు, ప్రత్యక్ష సాక్షుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం ఇళ్లకు పంపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?