వారికి ఇదే గతి పట్టొచ్చు, పూజారి సూసైడ్: సెల్పీ వీడియోలో సంచలనాలు

Published : Oct 03, 2018, 10:58 AM IST
వారికి ఇదే గతి పట్టొచ్చు, పూజారి సూసైడ్: సెల్పీ వీడియోలో సంచలనాలు

సారాంశం

 తూర్పు గోదావరి జిల్లా  కోరుకొండ మండలంలోని కణపూర్‌లోని  దేవాలయంలో పనిచేసే  మల్లిఖార్జున శర్మ  ఆత్మహత్య చేసుకొనే ముందు  సెల్పీ వీడియో రికార్డు చేశారు

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా  కోరుకొండ మండలంలోని కణపూర్‌లోని  దేవాలయంలో పనిచేసే  మల్లిఖార్జున శర్మ  ఆత్మహత్య చేసుకొనే ముందు  సెల్పీ వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం  వైరల్‌గా మారింది.

అకారణంగా తనను  పాలకమండలి సభ్యులు విధుల నుండి తొలగించారని మల్లిఖార్జున శర్మ ఆవేదనను వ్యక్తం చేశాడు. తన స్థానంలో వచ్చే ఏ అర్చకుడికైనా ఇదే  గతి పట్టే అవకాశం లేకపోలేదని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

తనకు జరిగిన అన్యాయం మరేవరికి జరగకూడదని అయన  అభిప్రాయపడ్డారు.  తన ఆత్మహత్యకు కారణమైన  పాలకమండలి సభ్యుల పేర్లను  సెల్పీ వీడియోలో ఆయన  చెప్పారు.  

ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు తనతో పాటు  తన కుటుంబసభ్యులపై  నిందలు వేశారని ఆయన చెప్పారు.తన చావుకు కారణమైన వారిని వదిలపెట్టకూడదని ఆయన కోరారు. ఈ వీడియో రికార్డు చేసిన తర్వాత  మల్లిఖార్జున శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్