గర్భిణీని.. రైలులో నుంచి తోసేసారు!

Published : Dec 18, 2018, 11:36 AM IST
గర్భిణీని.. రైలులో నుంచి తోసేసారు!

సారాంశం

గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా.. దుండగులు రైలులో నుంచి తోసేసారు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం గొల్లపల్లివంక సమీపంలో చోటుచేసుకుంది.  


గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా.. దుండగులు రైలులో నుంచి తోసేసారు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం గొల్లపల్లివంక సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మచిలీపట్నం-బెంగళూరు మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్ ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. దివ్య అనే ఓ గర్భిణీ వద్ద నుంచి నగలు బలవంతంగా లాక్కున్న దొంగలు.. అంతటితో ఆగకుండా.. ఆమెను రైలులో నుంచి కిందకు తోసేసారు. ఈ ఘటనలో దివ్య తీవ్రగాయాలపాలైంది.

గమనించిన స్థానికులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దివ్య బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. బెంగళూరు వెళ్లేందుకు ఆమె పిడుగురాళ్లలో రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్